42
అమెరికా రాజకీయాల్లో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్తల్లో నిలిచారు. ఇరాన్‌తో జరుగుతున్న అణు ఒప్పంద చర్చలపై స్పందించిన ట్రంప్, వారు సరైన విధంగా వ్యవహరించడం లేదని విమర్శించారు.ట్రూత్ సోషల్ లో చేసిన పోస్టులో “అణు ఒప్పందం ఎలా చేసుకోవాలో ఇరాన్‌కు తెలియడం లేదు” అని పేర్కొన్నారు. వారు తెలివిగా వ్యవహరిస్తే మంచిదని హితవు పలికారు.ఇక “ఇక మీదట అంత మంచి వాడిగా ఉండను” అంటూ రైఫిల్ పట్టుకున్న ఫోటోను షేర్ చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ పోస్టు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.





Total views : 61413