Saturday, August 8, 2026
News Navigation
Saturday, August 8, 2026
News Navigation

Breaking

Saturday, August 8, 2026
Home Andhra Pradesh మా స్థలాన్ని కాపాడండి మహాప్రభో.

మా స్థలాన్ని కాపాడండి మహాప్రభో.

by CVR NEWS
మా స్థలాన్ని కాపాడండి మహాప్రభో!

మా స్థలాన్ని కాపాడండి మహాప్రభో అంటూ ఓ మానసిక వికలాంగుడు రెవిన్యూ కార్యాలయ గడప తట్టాడు. విశాఖ జిల్లా భీమిలి మండలం నగరపాలెం పంచాయతీలో తమ కుటుంబానికి చెందిన భూమిని ఇతరులు కబ్జా చేశారని ఆరోపిస్తూ ఎమ్మార్వోకు విన్నవించాడు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. సుమారు ఎకరం 32 సెంట్ల భూమిని ఇతరులు అక్రమంగా ఆక్రమించుకున్నారని బాధితుడు ఆరోపించాడు. అడంగల్‌లో పేరు మార్పును ఆధారంగా చేసుకుని ఇప్పుడు భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశాడు. తమ భూమిని కాపాడాలని అధికారులను వేడుకున్నాడు. బాధితుడి ఫిర్యాదును స్వీకరించామని, చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ పేర్కొన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: