Saturday, August 8, 2026
News Navigation
Saturday, August 8, 2026
News Navigation

Breaking

Saturday, August 8, 2026
Home Latest News కొనసాగుతున్న ఉభయ సభల వాయిదాల పర్వం.

కొనసాగుతున్న ఉభయ సభల వాయిదాల పర్వం.

by CVR NEWS

నీట్‌ పేపర్‌ లీకేజి పై పార్లమెంట్‌ ఉభయ సభలు అట్టుడుకాయి. గురువారం ఉదయం సభలు ప్రారంభం అవ్వడమే అలస్యం విపక్షలు సభను అడ్డుకోవడంతో సభలు వాయిదాల పర్వం నాలుగవ రోజు కూడా కొనసాగుతుంది. పేపర్‌ లీకేజీలు పై కేంద్రం వివరణ,… కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా,… విద్యార్థులకు క్షేమాపణ చెప్పాలనే డిమాండ్‌తో ఉభయ సభలను ప్రతిపక్షాలు అడ్డకుకోవడంతో వరుసగా నాలుగవ రోజు కూడా సభలు వాయిదా పడ్డాయి.

అనేక కీలక అంశాల పై చర్చించేందుకు ప్రారంభమైన పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు అడుగు కూడా ముందుకు సాగడం లేదు. పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమై నాలుగు రోజులు గడుస్తున్నప్పటికీ చర్చలకు విపక్షలు ససేమీరా అంటున్నాయి. ముఖ్యంగా నీట్‌ పేపర్‌ లీకేజి విషయంలో పార్లమెంట్‌ సమావేశాలు అగ్గి రాజేసింది. పేపర్‌ లీకేజికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ విపక్షలు పట్టుపట్టాయి. ఇప్పటికే మూడు రోజుల పాటు ఇదే అంశంలో ఉభయ సభలు వాయిదా పడగా నాలుగవ రోజు కూడా పరిస్థితలో ఎలాంటి మార్పు రాకపోవడం గమనార్హం. ఓ వైపు ఎన్డీఏ పక్షాలు మరోవైపు యూపీఏ పక్షాలు కూడా సభలో అందోళనలు చేయడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకుంది. సభలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతి పక్ష పార్టీలు అందోళన చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో సభలు పలు మార్లు వాయిదా పడ్డాయి. చివరకు సభ నిర్వహణలో ఏలాంటి మార్పు రాకపోవడంతో సభాపతులు శుక్రవారంకు సభను వాయిదా వేశారు. సభలు వాయిదా పడిన తరువాత కూడా విపక్షలు పార్లమెంట్‌ ఎదుట ప్లేకార్డులతో అందోళన చేపట్టాయి. పేపర్‌ లీక్‌కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని లేదంటే కేంద్ర ప్రభుత్వమే అయను బర్తరఫ్‌ చేయాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: