మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పాఠశాలలు పున ప్రారంభించడంతో ప్రభుత్వ పాఠశాలలలో చదివే నిరుపేద విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తన సొంత డబ్బులతో జడ్చర్ల నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలలో కోటి 75 లక్షల విలువైన (షూస్) బూట్లను 53,000 మంది విద్యార్థులకు అందజేయబోతున్నామని అవి కూడా బ్రాండ్ (బాటా) కంపెనీకి చెందిన బూట్లను మాత్రమే పంపిణీ చేస్తున్నామని అంతేగాక విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ఎల్ఈడి టీవీలను మరియు వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నామని ఆయన అన్నారు. వాటి కోసం ప్రత్యేకంగా నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాలలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి సంబంధిత విద్యాధిరుల ప్రోత్సాహంతో పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తామని ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్రంలో ఎక్కడ మొదలు పెట్టలేదని తాను మాత్రమే నిరుపేద విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలల పై నూతన శకానికి నాంది పలికిన జడ్చర్ల MLA , వారి భవిష్యత్తు కోసం చేయడం జరుగుతుందని ఇది ఇంతటితో ఆగిపోకుండా నిరంతర ప్రక్రియగా కొనసాగుతోందని ఆయన తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వర్ణాంధ్ర–2047 థీమ్‌తో రాయపూడిలోని పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.సీడ్ యాక్సెస్ రోడ్డు…
- ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ చరిత్రలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ‘వందేమాతరం’ గేయాన్ని పూర్తిస్థాయిలో ఆలపించడం…
- టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.టీవీ ఛానెళ్లలో ప్రసారం అయ్యే యాడ్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెలివిజన్ ఛానెళ్లలో ప్రతి గంటకు గరిష్టంగా 12 నిమిషాల వాణిజ్య ప్రకటనల ప్రసారానికే పరిమితం చేస్తూ రెండు దశాబ్దాల క్రితం విధించిన నిబంధనను తొలగిస్తూ కేంద్ర…
- ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం.ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదైందని, ఫ్లోరెస్ ప్రాంతంలోని ఎండే నగరానికి 68 కి.మీ దూరంలో, 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం నమోదైందని అంతర్జాతీయ భూభౌతిక కేంద్రాలు…
- నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు .తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు చెప్పింది. పోలీస్, ఎక్సైజ్, ఫారెస్ట్ తదితర యూనిఫాం సర్వీసుల ఉద్యోగ నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్ల పాటు పెంచుతూ శుక్రవారం కీలక నిర్ణయం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.