Saturday, May 9, 2026
News Navigation
Saturday, May 9, 2026
News Navigation

Breaking

Saturday, May 9, 2026
Home Andhra Pradesh నిందితులతో కలిసి పోలీసుల చేతివాటం

నిందితులతో కలిసి పోలీసుల చేతివాటం

by Rama
నిందితులతో కలిసి పోలీసుల చేతివాటం

పోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు నిందితులతో చేతులు కలిపారు. సెటిల్ మెంట్ పేరుతో వారి వద్ద లక్షల రూపాయలు లంచంగా తీసుకున్నారు. అత్తిలి మండలం బల్లిపాడు గ్రామానికి చెందిన మారుతీ తన రెండు గేదెలు అపహరణకు గురయ్యాయని ఆగస్టులో తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. అయితే ఆ కేసు విషయంలో నిందితులతో సెటిల్ మెంట్ చేసుకున్న పోలీసులు 13 లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో పోలీసు ఉన్నతాధికారులు రూరల్ ఇన్ స్పెక్టర్ ఏజీఎస్ మూర్తి, ఏఎస్ఐ అంజిబాబులను వీఆర్ లోకి పంపుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • చీరాలలో చెత్త నుంచి సంపద లక్ష్యం గాలిలోకేనా?
    ప్రకాశం జిల్లా చీరాల మున్సిపాలిటీలో “చెత్త నుంచి సంపద” సృష్టించాలనే ప్రభుత్వ లక్ష్యం నేడు ప్రశ్నార్థకంగా మారిందనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు పారిశుధ్యంలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన చీరాల పట్టణం… ఇప్పుడు చెత్త నిర్వహణలోనే తీవ్ర వైఫల్యాలకు నిలయంగా మారిందని…
  • హ్యాపీ బర్త్ డే విజయ్ దేవరకొండ..
    స్టార్ గా, పర్సన్ గా విజయ్ దేవరకొండ జర్నీ ఎప్పుడూ ప్రత్యేకమే. ఒక్కొక్కటిగా ఆయన అనౌన్స్ చేస్తున్న భారీ పాన్ ఇండియా సినిమాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. హీరో కొత్త సినిమా ఆయన గత సినిమా సాధించిన బాక్సాఫీస్ కలెక్షన్స్ మీద, ఆ…
  • ప్రేమ ఎక్కడ పుడుతుందో ఎవరూ చెప్పలేరు..
    ప్రేమ ఎక్కడ పుడుతుందో ఎవరూ చెప్పలేరు. కానీ ఈ ప్రేమకథ వింటే మీరు ముక్కున వేలేసుకోవాల్సిందే..! సాధారణంగా పోలీసులు అంటే నేరస్తులకు భయం.. జైలర్ అంటే ఖైదీలకు వణుకు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. చట్టాన్ని కాపాడాల్సిన ఒక జైలు…
  • విశాఖ కైలాసగిరిపై సరికొత్త అట్రాక్షన్..
    పర్యాటక కేంద్రమైన విశాఖపట్నంలోని కైలాసగిరిపై మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. పర్యాటకులను విశేషంగా ఆకర్షించేందుకు VMRDA సుమారు రూ.2.5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ‘త్రిశూల్‌ ప్రాజెక్టు’ అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన 65 అడుగుల భారీ…
  • యాదాద్రిలో హాట్ టాపిక్ గా ప్రభుత్వ భూముల వివాదం..
    యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ భూముల వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఆలేరు నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు అధికార పార్టీకే కాకుండా స్థానిక అధికార యంత్రాంగానికీ సవాలుగా మారాయి.…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

010941
Total views : 70904

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.