అభివృద్ధిలో భాగంగా చేపట్టే ప్రతిపనిలో కచ్చితంగా నాణ్యత ప్రమాణాలు పాటించాల్సిందేనని, అందులో ఎలాంటి రాజీలేదని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. కందుకూరు మున్సిపాలిటీ ప్రత్యేక నిధులతో, పట్టణంలో 55 లక్షలతో చేపట్టబోతున్న పలు పనులకు గురువారం ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. 2వ వార్డు ఉర్దూస్కూల్ వద్ద 15.29 లక్షలతో సిసి రోడ్డు, 25వ వార్డు గాయత్రీ నగర్ లో 25.17లక్షలతో డ్రైనేజీ కాలువ, 32వ వార్డు చైతన్య విద్యాలయం వెనుక 14.53 లక్షలతో చేపట్టబోయే సిసి రోడ్డు నిర్మాణాల పనులను ఆయన ప్రారంభించారు. కాంట్రాక్టర్లకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సూచన ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ పనులు నాణ్యతగా చేపట్టాలని, ప్రభుత్వ నిబంధనలకు లోబడి పనులు చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. కందుకూరు మున్సిపాలిటీ పరిధిలో ఇకనుంచి అభివృద్ధి పనులు వేగంగా జరుగుతూనే ఉంటాయని, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో మాట్లాడి మరిన్ని నిధులు తీసుకొస్తానని నాగేశ్వరరావు తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- 17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు డీఎంఆర్‌సీ కీలక ప్రకటన చేసింది. ఇవాళ ఉదయం 7:30 గంటల నుంచి సెంట్రల్ ఢిల్లీ పరిధిలోని 17 ప్రధాన మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను తాత్కాలికంగా మూసివేసినట్లు వెల్లడించింది. అయితే రాజీవ్ చౌక్, మండీ హౌస్,…
- నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ.నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పరీక్షల నిర్వహణలో చేపట్టిన సంస్కరణలు, సాధించిన పురోగతిపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రంతో పాటు NTAలను ఆదేశించింది సుప్రీంకోర్టు. కేవలం తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా, పరీక్షా వ్యవస్థలో శాశ్వత ప్రాతిపదికన…
- నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ శుక్లతో కలిసి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే… ప్రజలకు అందుతున్న సేవలు,…
- సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచిత్ర ఘటన.సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఓ విచిత్రకరమైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా నేరస్తులు, ఖైదీలకు వేయాల్సిన సంకెళ్లను ఏకంగా పోలీస్ స్టేషన్ ప్రధాన గేటుకే వేసిన దృశ్యాలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఠాణా ప్రాంగణంలోకి ఇతర వాహనాలు, అనధికార…
- సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష విరమణ.దేశ విద్యావ్యవస్థలో పారదర్శకత, సమగ్ర సంస్కరణల కోసం గత 26 రోజులుగా లడఖ్ పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఎట్టకేలకు ముగిసింది. కేంద్ర ప్రభుత్వంతో జరిగిన కీలక చర్చల అనంతరం ఆయన తన సుదీర్ఘ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి