Monday, September 28, 2026
News Navigation
Monday, September 28, 2026
News Navigation

Breaking

Monday, September 28, 2026
Home Latest News తాజా కూల్చివేతలలో మంత్రి పొంగులేటికి చెందిన క్రషర్..

తాజా కూల్చివేతలలో మంత్రి పొంగులేటికి చెందిన క్రషర్..

by CVR NEWS
తాజా కూల్చివేతలలో మంత్రి పొంగులేటికి చెందిన క్రషర్

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ సమీపంలోని కొత్వాల్‌ గూడలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న స్టోన్‌ క్రషర్లను హైడ్రా కూల్చివేసింది. పలు కంపెనీలకు చెందిన ఐదు క్రషర్‌ మెషీన్లతోపాటు 12 ఆర్‌ఎంసీ యూనిట్లను తొలగించింది. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, మైనింగ్‌శాఖ ఫిర్యాదుతో హైడ్రా ఈ చర్యలు చేపట్టింది. క్రషర్‌ మిషన్లను తొలగించేందుకు పీబీసీ, మైనింగ్‌శాఖలు హైడ్రా సాయం కోరాయి. రూ.వందల కోట్లు బకాయిలు చెల్లించకుండా అక్రమంగా నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదు చేశాయి. వీటిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవా క్రషర్స్‌ను కూడా హైడ్రా అధికారులు కూల్చివేశారు. గ‌త అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా మాజీ మంత్రి హరీశ్‌ రావు రాఘ‌వా క్రషర్ అక్రమాలపై చేసిన ఆరోపణలతో ప్రభుత్వం డైలమాలో ప‌డింది. అయితే మంత్రి పొంగులేటిని ఒప్పించిన ప్రభుత్వం తాజాగా కూల్చివేత‌లు చేప‌ట్టింది. అయితే ఈ కూల్చివేతలపై పొంగులేటి అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పొంగులేటికి చెందిన కంపెనీ ఆ లిస్ట్‌లో లేదని స్థానిక అధికారులు తెలియజేసినా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధంతో రాజకీయ దుమారం చెల‌రేగింది. ఈ నేపథ్యంలో తాజా కూల్చివేతలపై హైడ్రా స్పష్టతనివ్వాల్సి ఉంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: