Wednesday, May 20, 2026
News Navigation
Wednesday, May 20, 2026
News Navigation

Breaking

Wednesday, May 20, 2026
Home Latest News “తెలంగాణ రక్షణ సేన కాదు… రాక్షస సేన” అంటూ కవితపై ఫైర్…

“తెలంగాణ రక్షణ సేన కాదు… రాక్షస సేన” అంటూ కవితపై ఫైర్…

by CVR NEWS
"తెలంగాణ రక్షణ సేన కాదు... రాక్షస సేన" అంటూ కవితపై ఫైర్

మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలం కుచర్కల్ గ్రామంలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. గ్రామానికి విచ్చేసిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి గ్రామస్తులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్‌కు చెందిన పలువురు స్థానిక నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అనంతరం నిర్వహించిన సభలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవితపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, ఆమె పార్టీని “తెలంగాణ రక్షణ సేన కాదు, తెలంగాణ రాక్షస సేన”గా అభివర్ణించారు. తెలంగాణను దోచుకోవడానికే ఆ పార్టీ ఏర్పాటైందని ఆరోపించారు. తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు అవినీతి, దోపిడీ గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత మాత్రమే ప్రజల పేరుతో రాజకీయాలు చేయడం సరైంది కాదని మండిపడ్డారు. సొంత తండ్రిపైనే పోరాటం చేస్తున్న నేత, రేపు ప్రజల కోసం ఏమి చేస్తారో అంటూ అనుమానం వ్యక్తం చేశారు.

Advertisements

You may also like

Our Visitor

014997
Total views : 81457

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.