Tuesday, June 16, 2026
News Navigation
Tuesday, June 16, 2026
News Navigation

Breaking

Tuesday, June 16, 2026
Home Latest News పూణేలో కూలిన శిక్షణ విమానం..

పూణేలో కూలిన శిక్షణ విమానం..

by CVR NEWS
పూణేలో కూలిన శిక్షణ విమానం

మహారాష్ట్ర పుణే జిల్లా బారామతిలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. శిక్షణకు ఉపయోగించే ఓ విమానం సాంకేతికలోపంతో కూలిపోయింది. ఈ ఘటనలో ట్రైనీ పైలట్‌కు గాయాలయ్యాయి. రెడ్‌బర్డ్‌ ఏవియేషన్‌ సంస్థకు చెందిన విమానం శిక్షణ కార్యక్రమంలో ఉండగా అందులో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో ఉదయం 9 గంటల సమయంలో బారామతి విమానాశ్రయాన్ని ఆనుకొని ఉన్న గోజుబావి గ్రామం సమీపంలో క్రాష్‌ ల్యాండ్‌ అయ్యింది. ఈ ల్యాండింగ్‌కి ముందు విమానంలోని కొంత భాగం ఓ విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో విమానంలో శిక్షణ పొందుతున్న పైలట్‌ మాత్రమే ఉన్నారు. ఈ ఘటనలో అతనికి గాయాలయ్యాయి. క్రాష్‌ ల్యాండింగ్‌ అయిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు. ఐతే ఈ గ్రామంలో ఇంతకుముందు కూడా విమాన ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

Advertisements

You may also like

Our Visitor

023949
Total views : 143614

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.