Tuesday, August 25, 2026
News Navigation
Tuesday, August 25, 2026
News Navigation

Breaking

Tuesday, August 25, 2026
Home International అమెరికా వెళ్లే భారతీయ ఉద్యోగులకు భారీ షాక్.

అమెరికా వెళ్లే భారతీయ ఉద్యోగులకు భారీ షాక్.

by CVR NEWS
visa

అమెరికాలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇవ్వనుంది. H-1B వీసాపై లక్షా 3 వేల డాలర్ల వరకు ఫీజు విధించే ప్రతిపాదనలను తీసుకొచ్చింది. కోర్టులు గతంలో కొన్ని చర్యలను అడ్డుకున్నప్పటికీ, వీసా విధానాల్లో కఠిన మార్పుల విషయంలో ట్రంప్ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది.

ప్రస్తుతం H-1B వీసా లబ్ధిదారుల్లో దాదాపు 71 శాతం మంది భారతీయులే ఉండటంతో ఈ ప్రతిపాదనలు భారతీయ ఐటీ నిపుణులపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. H-1B వీసాతో పాటు అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు సంబంధించిన F-1 వీసా, యూనివర్సిటీ పూర్తి చేసి ఉద్యోగాల్లో చేరేందుకు ఉపయోగించే OPT ప్రోగ్రామ్‌పైనా భారీ ఫీజు విధించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

అంతేకాకుండా, అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన H-1B వీసాదారులకు ప్రస్తుతం ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను తొలగించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. H-1B వీసాలకు స్పాన్సర్ చేసే కంపెనీలపై కూడా అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. H-1Bకు సంబంధించిన మొత్తం 3 లక్షలా 99 వేల 402 పిటిషన్లలో సుమారు 71 శాతం భారతీయులవే. ఈ మార్పులను ఈ ఏడాది చివరి నాటికి అమలు చేయాలని ట్రంప్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇవి ప్రస్తుతం ప్రతిపాదనల దశలోనే ఉండగా, తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: