Tuesday, August 25, 2026
News Navigation
Tuesday, August 25, 2026
News Navigation

Breaking

Tuesday, August 25, 2026
Home Latest News కెనడాపై ట్రంప్ సంచలన నిర్ణయం.

కెనడాపై ట్రంప్ సంచలన నిర్ణయం.

by CVR NEWS

కెనడా నుంచి దిగుమతి అయ్యే కార్లు, ట్రక్కులు, ఆటోమొబైల్ విడిభాగాలు, స్టీల్‌పై 50 శాతం భారీ దిగుమతి సుంకాలు విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ కొత్త టారిఫ్‌లు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. అమెరికా, కెనడా మధ్య వాణిజ్య చర్చలు విఫలమైన నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కెనడా చాలా ఏళ్లుగా అమెరికాను ఆర్థికంగా దెబ్బతీస్తోందని ట్రంప్ ఆరోపించారు. కెనడా ప్రభుత్వం అమెరికా రైతులు, వ్యవసాయ ఉత్పత్తులపై భారీ పన్నులు విధిస్తోందని, దీనివల్ల అమెరికాకు వాణిజ్య లోటు ఏర్పడుతోందని విమర్శించారు. అమెరికాలోనే పరిశ్రమలు ఏర్పాటు చేస్తే జీరో టారిఫ్ విధానం ఉంటుందని స్పష్టం చేశారు.

ట్రంప్ నిర్ణయంపై కెనడా ప్రధాని మార్క్ కార్నీ తీవ్రంగా స్పందించారు. అమెరికా తమపై ఆర్థిక దాడికి దిగుతోందని ఆరోపిస్తూ.. సెప్టెంబర్ 8 నుంచి అమెరికా ఉత్పత్తులపై సమాన స్థాయిలో ప్రతీకార సుంకాలు విధిస్తామని ప్రకటించారు. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఉత్తర అమెరికా ఆటోమొబైల్ పరిశ్రమకు కీలకమైన సరఫరా గొలుసుపై ఈ టారిఫ్‌ల ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. వాహనాల ఉత్పత్తి వ్యయం పెరగడంతో భవిష్యత్తులో కార్లు, ఇతర ఆటోమొబైల్ ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: