భారతీయుడు-2 సినిమాలో మాదిరి ఫోన్ లో వీడియోలు చూసుకుంటూ నర్సులే వైద్యం చేస్తున్నారు. వైద్యులు లేకపోవడంతో బుచ్చిరెడ్డిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనర్సులే.. డాక్టర్లు అయ్యారు . ఫోన్ లో చూసుకుంటూ వైద్యం చేస్తున్నారు. వారం రోజుల్లో ఒక్కసారి కూడా వైద్య కేంద్రం వైపు వైద్యులు చూడడం లేదని స్థానికులు వాపోతున్నారు. నెల్లూరులోని బుచ్చిరెడ్డిపాలెం పీహెచ్ సీలో సక్రమంగా వైద్యం అందడం లేదని బాధితుడు ఆత్మకూరు శ్రీనివాసులు తెలిపారు. వవ్వేరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు కాలికి చిన్న దెబ్బతలిగింది. వైద్యశాలకు వెళ్లి అడ్మిట్ అయ్యాడు. వారం రోజులు గడిచిన తనను ఒక్క డాక్టర్ కూడా చూడలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. నర్సులు మాత్రమే వైద్యం చేస్తున్నారన్నారు. చిన్నదిగా ఉన్న కాలి గాయం వైద్యం వల్ల తగ్గాల్సింది పోయి, వారం రోజుల్లో మరీ పెద్దదైందన్నారు. 24 గంటల వైద్యశాలలో వైద్యులు సక్రమంగా ఉండడం లేదని స్థానికులు అన్నారు. ఆసుపత్రిలో అన్ని రకాల పరికరాలు ఉన్నా వైద్యులు లేకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయన్నారు. ఆసుపత్రిలో స్వీపర్గా పనిచేస్తున్న ఆమె ఓపీలు రాయడం, ఫార్మసీలో మందులు తేవడం, సెలైన్లు పెట్టడం ఇంజక్షన్లు చేయడం విశేషమని స్థానికులు, రోగులు తెలుపుతున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- చీరాలలో చెత్త నుంచి సంపద లక్ష్యం గాలిలోకేనా?ప్రకాశం జిల్లా చీరాల మున్సిపాలిటీలో “చెత్త నుంచి సంపద” సృష్టించాలనే ప్రభుత్వ లక్ష్యం నేడు ప్రశ్నార్థకంగా మారిందనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు పారిశుధ్యంలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన చీరాల పట్టణం… ఇప్పుడు చెత్త నిర్వహణలోనే తీవ్ర వైఫల్యాలకు నిలయంగా మారిందని…
- హ్యాపీ బర్త్ డే విజయ్ దేవరకొండ..స్టార్ గా, పర్సన్ గా విజయ్ దేవరకొండ జర్నీ ఎప్పుడూ ప్రత్యేకమే. ఒక్కొక్కటిగా ఆయన అనౌన్స్ చేస్తున్న భారీ పాన్ ఇండియా సినిమాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. హీరో కొత్త సినిమా ఆయన గత సినిమా సాధించిన బాక్సాఫీస్ కలెక్షన్స్ మీద, ఆ…
- ప్రేమ ఎక్కడ పుడుతుందో ఎవరూ చెప్పలేరు..ప్రేమ ఎక్కడ పుడుతుందో ఎవరూ చెప్పలేరు. కానీ ఈ ప్రేమకథ వింటే మీరు ముక్కున వేలేసుకోవాల్సిందే..! సాధారణంగా పోలీసులు అంటే నేరస్తులకు భయం.. జైలర్ అంటే ఖైదీలకు వణుకు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. చట్టాన్ని కాపాడాల్సిన ఒక జైలు…
- విశాఖ కైలాసగిరిపై సరికొత్త అట్రాక్షన్..పర్యాటక కేంద్రమైన విశాఖపట్నంలోని కైలాసగిరిపై మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. పర్యాటకులను విశేషంగా ఆకర్షించేందుకు VMRDA సుమారు రూ.2.5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ‘త్రిశూల్ ప్రాజెక్టు’ అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన 65 అడుగుల భారీ…
- యాదాద్రిలో హాట్ టాపిక్ గా ప్రభుత్వ భూముల వివాదం..యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ భూముల వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఆలేరు నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు అధికార పార్టీకే కాకుండా స్థానిక అధికార యంత్రాంగానికీ సవాలుగా మారాయి.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 70878