ఏలూరు జిల్లాలో ఈ నెల 24న నిర్వహించనున్న మెగా పేరెంట్స్–టీచర్స్ మీట్‌కు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలోని 1,772 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె, రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలు అందిస్తోందన్నారు. ఈ చర్యలతో విద్యార్థుల విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో విద్యార్థుల భవిష్యత్తును మరింత బలోపేతం చేయడమే మెగా పేరెంట్స్–టీచర్స్ మీట్ ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ వివరించారు.
ఏలూరు జిల్లాలో మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్‌కు విస్తృత ఏర్పాట్లు.
47
previous post