Saturday, August 8, 2026
News Navigation
Saturday, August 8, 2026
News Navigation

Breaking

Saturday, August 8, 2026
Home Latest News ఫిఫా ప్రపంచకప్ విజేతగా చరిత్ర సృష్టించిన స్పెయిన్.

ఫిఫా ప్రపంచకప్ విజేతగా చరిత్ర సృష్టించిన స్పెయిన్.

by CVR NEWS

ఫిఫా వరల్డ్ కప్–2026లో స్పెయిన్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై విజయం సాధించి రెండోసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. మ్యాచ్ అంతా స్పెయిన్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించగా, అర్జెంటీనా ఒక్క షాట్ కూడా లక్ష్యంపై నమోదు చేయలేకపోయింది. స్పెయిన్ ఆటగాళ్లు వరుసగా దాడులు చేస్తూ మొత్తం 12 ప్రయత్నాలు చేయగా, అర్జెంటీనా గోల్‌కీపర్ ఎమిలియానో మార్టినెజ్ 11 అద్భుతమైన సేవ్‌లతో జట్టును నిలబెట్టాడు. అయితే ఎక్స్‌ట్రా టైమ్ 106వ నిమిషంలో నికో విలియమ్స్ ఇచ్చిన అద్భుతమైన పాస్‌ను ఫెర్రాన్ టోర్రెస్ గోల్‌గా మలచడంతో స్పెయిన్‌కు చిరస్మరణీయ విజయం దక్కింది. ఈ గోల్ ఫుట్‌బాల్ చరిత్రలో నిలిచిపోయే క్షణంగా అభిమానులు అభివర్ణిస్తున్నారు.

న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో నరాలు తెగే ఉత్కంఠ మధ్య స్పెయిన్ జట్టు ప్రపంచ కప్‌ను ముద్దాడింది. నాలుగోసారి ఛాంపియన్‌గా నిలిచి సరికొత్త రికార్డు సృష్టించాలనే లియోనెల్ మెస్సీ బృందం ఆశలకు అడ్డుకట్టు వేసిన స్పెయిన్, ఏకంగా 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్లీ ఫుట్‌బాల్ విశ్వవిజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఇరు జట్ల రక్షణ శ్రేణులు అత్యంత పటిష్టంగా నిలబడటంతో నిర్ణీత 90 నిమిషాల పూర్తి సమయం ముగిసేసరికి ఇరు జట్లూ ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి, దీనితో మ్యాచ్ 0-0 తో డ్రాగా నిలిచి ఎక్స్‌ట్రా టైమ్‌కు దారితీసింది. ఫెర్నాండేజ్ రెడ్ కార్డ్ వల్ల బయటికి వెళ్లినా అర్జెంటీనా కీపర్ మార్టినెజ్ వీరోచితంగా స్పెయిన్ దాడులను అడ్డుకున్నప్పటికీ, ఎక్స్‌ట్రా టైమ్‌లో స్పెయిన్ తన వ్యూహాలకు పదును పెట్టింది. మ్యాచ్ 106వ నిమిషంలో స్పెయిన్ స్టార్ ఆటగాడు ఫెర్రాన్ టోర్రెస్.. లభించిన అద్భుత అవకాశాన్ని గోల్‌గా మలచడంతో స్టేడియం ఒక్కసారిగా హోరెత్తిపోయింది. ఈ ఏకైక గోల్‌తో మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించిన స్పెయిన్ ఆఖరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకుంటూ అర్జెంటీనాపై చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసి, సరికొత్త ఫుట్‌బాల్ రాజ్యాంగాన్ని లిఖించింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: