Saturday, August 8, 2026
News Navigation
Saturday, August 8, 2026
News Navigation

Breaking

Saturday, August 8, 2026
Home International అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం.

by CVR NEWS
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం

రష్యాపై మరింత ఆర్థిక ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో అమెరికాలో రూపొందించిన ఆంక్షల బిల్లుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు ప్రకటించారు. రష్యా నుంచి చమురు, సహజ వాయువు కొనుగోలు చేస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకునేలా ఈ బిల్లును రూపొందించారు. రష్యా నుంచి భారీగా చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్, చైనా వంటి దేశాలపై ఈ బిల్లు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. ఈ బిల్లు ప్రకారం రష్యా నుంచి కొనుగోళ్లు జరిపే దేశాలపై భారీ సుంకాలను విధించగల ప్రతిపాదిత ఆంక్షల బిల్లుకు వైట్ హౌస్ మద్దతు తెలిపింది. రష్యా చమురు, గ్యాస్, పెట్రోలియం ఎగుమతులలో దాదాపు 70 శాతం వాటా భారతదేశం, చైనాలదేనని ఇటీవల మరణించిన అమెరికా సెనెటర్ లిండ్సే గ్రాహమ్ చెబుతుండేవారు. ఈ ‘రష్యా శాంక్షనింగ్ యాక్ట్’ బిల్లును గ్రాహమ్ ప్రతిపాదించారు .

కాగా, ప్రారంభంలో పేర్కొన్న 500 శాతం సుంకాల ప్రతిపాదనలో కీలక మార్పులు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న ఐదు దేశాలపై సుంకాల గరిష్ఠ పరిమితిని 100 శాతానికి తగ్గించారు. అలాగే కొన్ని మినహాయింపులు, అధ్యక్షుడికి ప్రత్యేక మినహాయింపు అధికారాలు కూడా బిల్లులో చేర్చారు. సవరించిన ఈ బిల్లుకు అధికార, ప్రతిపక్ష సభ్యుల నుంచి మద్దతు లభించింది. కాగా, ఈ బిల్లు ఇంకా చట్టంగా మారలేదు. కాంగ్రెస్‌లో ఆమోదం పొందిన తర్వాతే అమల్లోకి వస్తుంది (Russia oil imports). ఈ కొత్త ఆంక్షల బిల్లు అమల్లోకి వస్తే భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలపై, ఇంధన దిగుమతులపై ప్రభావం పడే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే బిల్లు ఏ రూపంలో ఆమోదం పొందుతుందనే అంశంపైనే ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందనేది ఆధారపడి ఉంటుంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: