Saturday, August 8, 2026
News Navigation
Saturday, August 8, 2026
News Navigation

Breaking

Saturday, August 8, 2026
Home Latest News పాకిస్తాన్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.

పాకిస్తాన్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.

by CVR NEWS
పాకిస్తాన్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు

పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బన్ను జిల్లాలో ఉన్న మిర్‌యాన్ పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.భారీ పేలుడుతో పోలీస్ స్టేషన్ పరిసరాలు ఒక్కసారిగా దద్దరిల్లిపోయాయి. ఈ ఘటనలో పలువురు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందగా..డజన్ల సంఖ్యలో భద్రతా సిబ్బంది గాయపడ్డారు.గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఘటన అనంతరం భద్రతా బలగాలు ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని గాలింపు చర్యలు చేపట్టాయి. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.ఈ ఘటనతో బన్ను జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించిన అధికారులు, పోలీస్ స్టేషన్లు మరియు కీలక ప్రభుత్వ కార్యాలయాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: