Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Latest News గగన్‌యాన్ మిషన్‌లో కీలక మైలురాయి సాధించిన ఇస్రో.

గగన్‌యాన్ మిషన్‌లో కీలక మైలురాయి సాధించిన ఇస్రో.

by CVR NEWS

భారత తొలి మానవ అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ మిషన్‌లో ఇస్రో మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. గగన్‌యాన్ కోసం రూపొందించిన ప్రధాన పారాచూట్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది. మధ్యప్రదేశ్‌లో ఐఎల్-76 విమానం ద్వారా 2.5 కిలోమీటర్ల ఎత్తు నుంచి నిర్వహించిన ఎయిర్‌డ్రాప్ టెస్ట్‌లో పారాచూట్లు అనుకున్న విధంగానే పనిచేశాయి. డమ్మీ బరువు వేగాన్ని సురక్షితంగా తగ్గించి విజయవంతంగా నేలకు చేర్చాయి. అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వచ్చే క్రూ క్యాప్సూల్‌ను సముద్రంలో సురక్షితంగా దించేందుకు ఈ 10 పారాచూట్ల వ్యవస్థ అత్యంత కీలకమని ఇస్రో తెలిపింది. ఈ విజయంతో గగన్‌యాన్ మిషన్ సిద్ధతలో మరో కీలక ముందడుగు పడింది.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

039430
Total views : 196783

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: