Saturday, August 8, 2026
News Navigation
Saturday, August 8, 2026
News Navigation

Breaking

Saturday, August 8, 2026
Home Latest News HPCL గ్యాస్ ప్లాంట్‌లోకి వరద నీరు.

HPCL గ్యాస్ ప్లాంట్‌లోకి వరద నీరు.

by CVR NEWS
HPCL గ్యాస్ ప్లాంట్‌లోకి వరద నీరు

మహారాష్ట్రలో భారీ వర్షాలు తీవ్ర బీభత్సం సృష్టిస్తున్నాయి. రాయగఢ్ జిల్లా చవానే గ్రామంలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీరు స్థానిక HPCL గ్యాస్ ప్లాంట్‌లోకి చేరడంతో రీఫిల్లింగ్ కోసం నిల్వ ఉంచిన వందలాది ఖాళీ గ్యాస్ సిలిండర్లు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. వరద ఉధృతి కారణంగా సిలిండర్లు ప్రవాహంలో వేగంగా కొట్టుకుపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సిలిండర్లు ఎక్కడైనా ఇరుక్కుని ప్రమాదాలకు దారితీస్తాయేమోనన్న ఆందోళన స్థానికుల్లో నెలకొంది. అధికారులు అప్రమత్తమై పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: