Monday, September 14, 2026
News Navigation
Monday, September 14, 2026
News Navigation

Breaking

Monday, September 14, 2026
Home Andhra Pradesh ఆదివాసీల త్యాగాలను ఎప్పటికీ మర్చిపోలేం

ఆదివాసీల త్యాగాలను ఎప్పటికీ మర్చిపోలేం

by Satya
ఆదివాసీల త్యాగాలను ఎప్పటికీ మర్చిపోలేం

గిరిజనులు అన్ని రంగాల్లో ముందుండాలనేదే తమ లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబునాయుడు. అయితే గిరిజనులు ఇంకా వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో చంద్రబాబు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు, ఏకలవ్యుడిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ పాలన అంతానికి పోరాడి ప్రాణ త్యాగం చేశారని , ఆదివాసీల త్యాగాలను ఎప్పటికీ మర్చిపోలేం అని చంద్రబాబునాయుడు కొనియాడారు. స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తూ ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి కాగలిగారని అంచెలంచెలుగా ఎదిగిన ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఆఫ్రికా తర్వాత ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న గిరిజనులు ఉండే దేశం మనదేనన్నారు. ప్రధాని నరేంద్రమోదీ వచ్చినప్పుడు అరకు కాఫీ రుచి చూపించామన్నారు. మారుమూల ప్రాంతాల్లో ఉండే గిరిజనులు అభివృద్ధి చెందేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.
    హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సేవలను సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా.. రోశయ్య మాత్రం తన ప్రత్యేకతను…
  • ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..
    ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌‌లో హీరో సూరి మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌‌లో హీరో సుహాస్ ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్…
  • నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.
    ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
  • మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.
    బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్‌–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…
  • ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.
    ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్‌కు వస్తున్న జిన్‌పింగ్‌ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్‌పింగ్‌తో పాటు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: