Wednesday, July 8, 2026
News Navigation
Wednesday, July 8, 2026
News Navigation

Breaking

Wednesday, July 8, 2026
Home Telangana వరంగల్‌ వ్యవసాయ యూనివర్సిటీ పేపర్ లీకేజి ఘటనలో దర్యాప్తు ముమ్మరం

వరంగల్‌ వ్యవసాయ యూనివర్సిటీ పేపర్ లీకేజి ఘటనలో దర్యాప్తు ముమ్మరం

by CVR NEWS

వరంగల్‌ వ్యవసాయ యూనివర్సిటీ పేపర్ లీకేజి ఘటనలో సిఐడి దర్యాప్తును ముమ్మరం చేసింది.తొలుత ఒకరికి లీక్‌ చేసిన తర్వాత ఎంతమందికి చేరిందో ఆరా తీసారు.విచారణలో గత ఐదేళ్లుగా ఇన్ సర్వీస్ విద్యార్థులకు ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నట్లు గుర్తించారు.25-26 విద్యా సంవత్సరం థర్డ్ ఇయర్ ప్రశ్న పత్రాలు వరంగల్ అగ్రికల్చర్ కాలేజ్ నుంచి లీక్ అయ్యాయి. సెల్ఫోన్లో ఫోటోలు తీసి విద్యార్థులకు జూనియర్ అసిస్టెంట్ కార్తీక్ పంపించి జ్యోతి అనే ఇన్ సర్వీస్ విద్యార్థికి ప్రశ్నాపత్రాలు పంపి డబ్బులు వసూలుచేసినట్లు సమాచారం..జ్యోతి ద్వారా అశ్వరావుపేట వ్యవసాయ కాలేజీకి చెందిన బేబీ శాలిని, దుర్గారావులకు…అశ్వరావుపేట విద్యార్థుల నుంచి జగిత్యాల వ్యవసాయ కాలేజ్ విద్యార్థులు శ్రీనివాస్, రమేష్ లకు ప్రశ్నాపత్రాలు చేరాయి. ఇన్ సర్వీస్ విద్యార్థులు చైన్ సిస్టం ద్వారా వరంగల్, జగిత్యాల, పాలెం, అదిలాబాద్, రాజేంద్రనగర్, సిరిసిల్ల, అశ్వరావుపేట వ్యవసాయ కళాశాలలోని ఇన్ సర్వీస్ విద్యార్థులకు చేరుతుండగా ప్రశ్న పత్రాల లీకేజీలో లక్షల రూపాయలు చేతులు మారినట్లు సిఐడీ అధికారులు గుర్తించారు.దీనితో గత 5ఏళ్లుగా పాస్ అయిన ఇన్ సర్వీస్ విద్యార్థుల డిటైల్స్, వ్యవసాయ కళాశాలల్లోని జూనియర్ అసిస్టెంట్ల వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు..

Advertisements

You may also like

Our Visitor

038906
Total views : 192560

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: