Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home Latest News కరీంనగర్ కార్పొరేషన్‌లో స్మార్ట్‌ఫోన్ల వివాదం.

కరీంనగర్ కార్పొరేషన్‌లో స్మార్ట్‌ఫోన్ల వివాదం.

by CVR NEWS
కరీంనగర్ కార్పొరేషన్‌లో స్మార్ట్‌ఫోన్ల వివాదం

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కార్పొరేటర్లకు స్మార్ట్‌ఫోన్ల కొనుగోలు నిర్ణయం వివాదాస్పదంగా మారింది. మొత్తం 70 మంది కార్పొరేటర్ల కోసం రూ.23 లక్షల 43 వేల బడ్జెట్‌ను కేటాయిస్తూ కార్పొరేషన్ తీర్మానం చేసింది. శామ్‌సంగ్ గెలాక్సీ A37 సిరీస్ 5G స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుకు టెండర్ నోటీసు జారీ చేయగా, ఒక్కో ఫోన్ బేసిక్ ధరను రూ.33,474గా అధికారులు నిర్ణయించారు. ఫోన్లతో పాటు స్క్రీన్ గార్డ్, బ్యాక్ పౌచ్, ఛార్జర్లను కూడా మున్సిపల్ నిధులతోనే కొనుగోలు చేయనున్నారు. 8GB ర్యామ్, 256GB మెమొరీ, ట్రిపుల్ కెమెరా వంటి హైఎండ్ ఫీచర్లతో కూడిన ఫోన్లను ప్రజాధనంతో కొనుగోలు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ టెండర్ల దాఖలుకు జూలై 7 సాయంత్రం 4 గంటల వరకు గడువు విధించినట్లు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

040024
Total views : 203020

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: