Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home Telangana విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్ వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి.

విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్ వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి.

by CVR NEWS

ఫిఫా వరల్డ్ కప్-2026లో భాగంగా అర్జెంటినా, ఈజిప్ట్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులతో కలిసి వీక్షించారు.హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్‌పై సంక్షేమ పాఠశాలల విద్యార్థులతో కలిసి మ్యాచ్‌ను తిలకించారు. మ్యాచ్ ప్రారంభం నుంచి ముగింపు వరకు విద్యార్థుల కేరింతలు, చప్పట్లతో వేదిక సందడిగా మారింది.ఇటీవల ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ పర్యటనతో రాష్ట్రంలో ఫుట్‌బాల్‌పై ఆసక్తి మరింత పెరిగిన నేపథ్యంలో ఈ ప్రత్యేక వీక్షణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.అట్లాంటాలో జరిగిన ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో అర్జెంటినా 3-2 గోల్స్ తేడాతో ఈజిప్ట్‌పై విజయం సాధించింది. చివరి నిమిషం వరకు మ్యాచ్ హోరాహోరీగా సాగడంతో విద్యార్థులు ఉత్సాహంగా మ్యాచ్‌ను ఆస్వాదించారు.గత డిసెంబర్‌లో మెస్సీ హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో అభిమానులను అలరించి, యువతలో క్రీడాస్ఫూర్తిని నింపిన విషయం తెలిసిందే. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ విద్యార్థులకు ప్రపంచ స్థాయి క్రీడా అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక వీక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

040019
Total views : 202974

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: