Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home International ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ కు తప్పిన ముప్పు.

ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ కు తప్పిన ముప్పు.

by CVR NEWS

సిరియా రాజధాని డమాస్కస్‌లో వరుస పేలుళ్లు తీవ్ర కలకలం రేపాయి. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ ఆ దేశ పర్యటనలో ఉండగా.. ఆయన బస చేసిన హోటల్‌ వద్దే ఈ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. అయితే, ఈ ఘటనలో ఆయన క్షేమంగా బయటపడినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. సిరియా అధ్యక్షుడు అహ్మద్‌ అల్‌-షరాతో సమావేశమయ్యేందుకు అధ్యక్ష భవనంలోకి మెక్రాన్‌ వెళ్లిన వెంటనే సమీపంలోని ఫోర్ సీజన్స్‌ హోటల్‌ వద్ద పేలుళ్లు సంభవించడం గమనార్హం. సుదీర్ఘ కాలంగా అంతర్యుద్ధంతో నలిగిపోయిన సిరియా.. ఇటీవల అక్కడ పాలకులు మారిన తర్వాత పునర్నిర్మాణంపై దృష్టి సారించింది. పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే గతంలో పలు దేశాలు విధించిన అనేక ఆంక్షలను ఎత్తివేయడానికి పాశ్చాత్య దేశాలను ఒప్పించడంలో కీలక పాత్ర వహించిన మెక్రాన్‌.. అల్‌-షరా అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఆ దేశంలో కీలక పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా ప్రతినిధుల బృందంతో కలిసి డమాస్కస్‌లోని ఫోర్‌ సీజన్స్‌ హోటల్‌లోనే బస చేశారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

040023
Total views : 202988

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: