Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home Latest News హైదరాబాద్: నాచారంలో బాలామృతం ప్లాంట్ ప్రారంభం.

హైదరాబాద్: నాచారంలో బాలామృతం ప్లాంట్ ప్రారంభం.

by CVR NEWS
హైదరాబాద్: నాచారంలో బాలామృతం ప్లాంట్ ప్రారంభం

తెలంగాణలో మహిళలు, చిన్నారుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని నాచారంలో 20 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన బాలామృతం ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడిన సీఎం.. మహిళల సాధికారత, పిల్లల ఆరోగ్యం, విద్య, పోషకాహారం, సంక్షేమ కార్యక్రమాలపై ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కీలక కార్యక్రమాలను వివరించారు. నాచారంలో ప్రారంభమైన బాలామృతం ప్లాంట్ భవిష్యత్తులో తెలంగాణ అవసరాలను తీర్చడమే కాకుండా మరో నాలుగు నుంచి ఐదు రాష్ట్రాలకు కూడా పోషకాహార ఉత్పత్తులను సరఫరా చేసే స్థాయికి ఎదుగుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఆలోచనలే పునాది అని పేర్కొంటూ, చిన్న స్థాయిలో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పుడు ఆధునిక పరిశ్రమగా అభివృద్ధి చెందిందన్నారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

040019
Total views : 202969

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: