Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home Latest News పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.

పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.

by CVR NEWS
పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం

దేశంలోని కోట్ల మంది పీఎఫ్‌ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. పీఎఫ్ విత్‌డ్రా ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ EPFOలో విప్లవాత్మక మార్పులను ప్రవేశపెట్టింది. ఇకపై ఎలాంటి ఆలస్యం లేకుండా రూ.5 లక్షల వరకు ఉండే పీఎఫ్ క్లెయిమ్‌లను ఆటో క్లెయిమ్ సెటిల్‌మెంట్ పద్ధతి ద్వారా ఆటోమేటిక్‌గా ఆమోదించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, అందుకు సంబంధించిన EPFO కొత్త డిపాజిట్ వ్యవస్థ నేటి నుంచే అధికారికంగా ప్రారంభమైంది.

కొత్తగా చేపట్టిన ఈ టెక్నికల్ మార్పుల వల్ల ఇక నుంచి పీఎఫ్ సేవలు శరవేగంగా సాగనున్నాయి. ఇది వరకు క్లెయిమ్ సెటిల్‌మెంట్‌కు వారాల తరబడి వేచి చూడాల్సి రాగా.. ఇకపై రోజుల్లోనే పని పూర్తి కానుంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న ఖాతాదారులందరి పీఎఫ్ వివరాలను ఒకే కేంద్రీకృత డేటాబేస్ పరిధిలోకి తీసుకువచ్చారు. దీంతో ఉద్యోగులు దేశంలో ఎక్కడి నుంచైనా తమ పీఎఫ్ వివరాలను ఒకే చోట సులభంగా చూసుకోవచ్చు. జూలై 15 నాటికి ఖాతాల్లో జమ అయిన మొత్తానికి ప్రభుత్వం అందించే పీఎఫ్ వడ్డీ జమ చేసే ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

040023
Total views : 203013

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: