గుంటూరు నగరంలో అనధికార కట్టడాలపై నగరపాలక సంస్థ అధికారులు ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో అనధికార కట్టడాలు కట్టిన నేతలకు వెన్నులో వణుకు పుడుతోంది. అక్రమంగా నెలకు లక్షల్లో సంపాదిస్తున్న వారి నోట్లో మట్టి కొట్టినట్లు అయ్యింది. అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఒక వైసిపి ముఖ్య నేత బినామీల పేర్లతో అక్రమ కట్టడాలకు తెర లేపారు. కూటమి ప్రభుత్వం రావడంతో నగరపాలక సంస్థ అధికారులు కట్టడాలు కూల్చివేయడం మొదలుపెట్టారు. హైడ్రా తరహాలో నగరపాలక సంస్థ అధికారులు అనధికార కట్టడాలను కూల్చి వేస్తున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డులోని లక్ష్మీ సెలబ్రేషన్స్ బార్ అండ్ రెస్టారెంట్ యజమాని ఖలీల్ రెండు సంవత్సరాల క్రితం దాదాపు కోటి రూపాయలతో అక్రమ కట్టడం నిర్మించి అక్కడ బార్ అండ్ రెస్టారెంట్ ను నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత ఖలీల్ కు మేయర్ తో సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి అధికారులు
పేరుకు మాత్రం నామమాత్రపు నోటీసులు జారీ చేసి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ఇప్పుడు ఆ అక్రమ కట్టడాన్ని అధికారులు కూల్చివేశారు. నగర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్న కమిషనర్ పులి శ్రీనివాసులను నగరవాసులు అభినందిస్తున్నారు. ఇలాంటి అనధికారిక కట్టడాలు ఇంకా ఎన్ని ఉన్నాయో వాటిపై కూడా అధికారులు దృష్టి సారించాలని నగర ప్రజలు కోరుతున్నారు
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీడబ్ల్యూసీ అధికారుల పర్యటన.పోలవరం ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాల పరిస్థితులను తెలుసుకునేందుకు సీడబ్ల్యూసీ అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు.పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు మండలంలో పోలవరం ముంపుకు గురయ్యే ప్రాంతాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తెలంగాణలో పోలవరం ప్రాజెక్టు కారణంగా ప్రభావితమవుతున్న గ్రామాలు, ముంపు పరిస్థితులపై…
- కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ భవన్ లో గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్.. డీకేతో ప్రమాణం చేయించారు. డీకేతో పాటు జీ.పరమేశ్వర ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. సీఎంతో పాటు మొత్తం 13 మంది మంతృలుగా ప్రమాణం…
- జూన్ 19న విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్ళు’ మూవీ రిలీజ్.విజయ్ ఆంటోని చిత్రాలకు తెలుగులో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడూ డిఫరెంట్ కంటెంట్, భిన్న ప్రాజెక్టులతో ప్రేక్షకుల్ని మెప్పిస్తూనే ఉంటారు. ‘బిచ్చగాడు’తో హీరోగా విజయ్ ఆంటోని, దర్శకుడిగా శశికి వచ్చిన ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. మళ్లీ…
- రష్యా పర్యటనలో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ..రష్యా పర్యటనలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ స్పీడ్ పెంచారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మాస్కోలో ఆయన కీలక భేటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రష్యాకు చెందిన ప్రముఖ ‘స్బేర్ బ్యాంక్’ వైస్ ప్రెసిడెంట్ అల్బర్ట్ యెఫిమోవ్తో మంత్రి లోకేష్ ప్రత్యేకంగా…
- “సర్కారు బాయి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల.తెలంగాణ సామాజిక నేపథ్యంలో నీటి సమస్యలు, కుల వివక్ష, అణగారిన వర్గాల జీవిత పోరాటాలను ప్రతిబింబించే కథాంశంతో తెరకెక్కుతున్న ‘సర్కారు బాయి’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శక…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 92029