Saturday, August 8, 2026
News Navigation
Saturday, August 8, 2026
News Navigation

Breaking

Saturday, August 8, 2026
Home Andhra Pradesh భీమవరం సభలో స్వల్ప కలకలం.

భీమవరం సభలో స్వల్ప కలకలం.

by CVR NEWS
భీమవరం సభలో స్వల్ప కలకలం

అనంతరం వేదికపై అభిమానుల రద్దీ ఒక్కసారిగా పెరగడంతో.. తోపులాట జరిగింది. ఈ క్రమంలో జగన్‌ కిందపడిపోబోయినా.. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఆక్వా రైతులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్న జగన్‌.. ప్రసంగం ముగించుకుని వేదికపై ఉండగానే అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయనను దగ్గరగా చూసేందుకు ఒక్కసారిగా స్టేజిపైకి దూసుకొచ్చారు.

అభిమానుల రద్దీతో వేదికపై తోపులాట జరగగా.. ఆ గందరగోళంలో ఎవరో నెట్టేయడంతో జగన్‌ ఒక్కసారిగా తూలి కిందపడిపోబోయారు. అయితే అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆయనను పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. అనంతరం భద్రతా సిబ్బంది అభిమానులను వెనక్కి నెట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

ఈ ఘటనలో జగన్‌కు ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. అయితే వేదికపై భద్రతా ఏర్పాట్లపై చర్చకు తావిచ్చిన ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వేగంగా వైరల్‌ అవుతున్నాయి. అభిమానుల రద్దీని నియంత్రించడంలో లోపాలున్నాయా..? లేక అనూహ్యంగా జనసందోహం పెరగడంతో ఈ పరిస్థితి ఏర్పడిందా..? అనే అంశాలపై చర్చ కొనసాగుతోంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: