పిల్లలపై లైంగిక నేరాలను అరికట్టేందుకు పోక్సో చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
చిన్నారుల భద్రత రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని పేర్కొన్న పవన్ కళ్యాణ్… రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, ఆర్టికల్ 39 స్ఫూర్తికి అనుగుణంగా పిల్లల హక్కులను పరిరక్షించాలని కోరారు.పోక్సో కేసుల్లో ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని, ప్రాథమిక విచారణ పూర్తయ్యే వరకు వేచి చూడకుండా చట్టప్రకారం చర్యలు ప్రారంభించాలని సూచించారు.
షాబాద్‌లో ఇటీవల జరిగిన ఆరు హత్యల ఘటన నేపథ్యంలోనే ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీకి కూడా పవన్ కళ్యాణ్ లేఖ పంపారు.
రాజకీయ విమర్శలకు దూరంగా పరిపాలనా పరమైన సూచనలు, చిన్నారుల భద్రతకు సంబంధించిన చర్యలపై దృష్టి సారిస్తూ పవన్ కళ్యాణ్ రాసిన ఈ లేఖ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
పోక్సో చట్టం అమలుపై రేవంత్‌కు పవన్ కళ్యాణ్ లేఖ.
286
previous post