32
హిమాలయాల్లో అత్యంత అరుదుగా కనిపించే బ్రౌన్ బేర్లు మరోసారి కెమెరాకు చిక్కాయి.ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.క్రిటికల్‌గా ఎండేంజర్డ్ జాతికి చెందిన ఈ బ్రౌన్ బేర్ల సంఖ్య ఇప్పటికే చాలా తక్కువగా ఉంది. వీటి సహజ ఆవాసాలు క్రమంగా తగ్గిపోవడం, ఆహారం కోసం మానవ నివాస ప్రాంతాల వైపు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని నిపుణులు చెబుతున్నారు.వాతావరణ మార్పులు, అటవీ విస్తీర్ణం తగ్గిపోవడం, మానవ జోక్యం పెరగడం వంటి కారణాలతో వన్యప్రాణుల జీవన విధానం తీవ్రంగా ప్రభావితమవుతోందని వారు హెచ్చరిస్తున్నారు. హిమాలయాల జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు అటవీ సంరక్షణతో పాటు వన్యప్రాణుల ఆవాసాల పరిరక్షణకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.



Total views : 207683