36
హైదరాబాద్‌లో ఒలింపిక్ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్‌ను భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం స్పోర్ట్స్ వర్సిటీ వెబ్‌సైట్, లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. ఆటలు, రాజకీయాలు, కెరియర్‌లో పీటీ ఉష మనందరికీ స్ఫూర్తి అని కొనియాడారు. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకే స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చామని చెప్పారు. ఆటల కోసం తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసిందన్నారు.






Total views : 198621