Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home Film ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్ష బరిలో బండ్ల గణేష్.

ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్ష బరిలో బండ్ల గణేష్.

by CVR NEWS

తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్ష పదవికి ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ నామినేషన్ దాఖలు చేశారు.ఆయనతో పాటు మరో నిర్మాత సి. కళ్యాణ్ కూడా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. ఈసారి జరగబోతున్న ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి.దిల్ రాజు సారథ్యంలోని యాక్టివ్ తెలుగు ప్రొడ్యూసర్ గిల్డ్.. బండ్ల గణేష్‌కు మద్దతు ఇస్తున్నట్లు సమాచారం. ఇక వైస్ ప్రెసిడెంట్ పదవికి మోహన్ వడ్లపట్ల, కేఎల్ దామోదర ప్రసాద్, జీవితా రాజశేఖర్, భరత్ చౌదరి నామినేషన్లు వేశారు.నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 28 వరకు గడువు ఉంది.
సెప్టెంబర్ 6న తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటివరకు బండ్ల గణేష్ కు ఇండస్ట్రీలో మద్దతు పెరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ ఎన్నికల్లో బండ్ల గణేష్, సి. కళ్యాణ్‌లలో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: