Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home Andhra Pradesh 2027 గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు.

2027 గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు.

by CVR NEWS

2027 గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు జరిగే పుష్కరాలకు 8 నుంచి 10 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
రూ.4,026 కోట్లతో 4,932 పనులు చేపడుతుండగా.. భక్తుల రద్దీ కోసం 440 ఘాట్లను సిద్ధం చేస్తున్నారు. పాత 259 ఘాట్లను అభివృద్ధి చేయడంతో పాటు 181 కొత్త ఘాట్లు నిర్మించనున్నారు.రద్దీ నిర్వహణకు ఏఐ క్రౌడ్ అనలిటిక్స్, సీసీటీవీలు, డ్రోన్లు, క్యూఆర్ ఆధారిత వాహన గుర్తింపు వంటి సాంకేతికతను వినియోగించనున్నారు. 30 తాత్కాలిక ఫీల్డ్ ఆస్పత్రులు, 2,697 రెస్క్యూ బోట్లు, 8,955 మంది శిక్షణ పొందిన ఈతగాళ్లను అందుబాటులో ఉంచనున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: