Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home Andhra Pradesh ఏపీ లోకాయుక్త జస్టిస్‌గా తల్లాప్రగడ మల్లికార్జునరావు ప్రమాణం.

ఏపీ లోకాయుక్త జస్టిస్‌గా తల్లాప్రగడ మల్లికార్జునరావు ప్రమాణం.

by CVR NEWS

ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త జస్టిస్‌గా తల్లాప్రగడ మల్లికార్జునరావు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరై జస్టిస్ మల్లికార్జునరావుకు అభినందనలు తెలిపారు. ఏపీ లోకాయుక్తగా ఆయన ఐదేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగం వంటి అంశాలపై వచ్చే ఫిర్యాదులను పరిశీలించడంలో లోకాయుక్త కీలక పాత్ర పోషిస్తుంది. ప్రజలకు మెరుగైన పాలన అందేలా, ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించే దిశగా లోకాయుక్త వ్యవస్థ పనిచేయనుంది. ఈ నేపథ్యంలో జస్టిస్ మల్లికార్జునరావు బాధ్యతలు స్వీకరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, న్యాయశాఖకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. కొత్త బాధ్యతల్లో ప్రజల ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇస్తూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని పలువురు ఆకాంక్షించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: