Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home Andhra Pradesh విజయవాడ వేదికగా నేడు డబ్ల్యూఏపీఎల్ ప్లేయర్స్ ఆక్షన్.

విజయవాడ వేదికగా నేడు డబ్ల్యూఏపీఎల్ ప్లేయర్స్ ఆక్షన్.

by CVR NEWS

మహిళల ఏపీ ప్రీమియర్ లీగ్ ప్లేయర్స్ ఆక్షన్‌కు సర్వం సిద్ధమైంది. విజయవాడ వేదికగా నేడు డబ్ల్యూఏపీఎల్ ప్లేయర్స్ వేలం జరగనుంది. వేలంలో 191 మంది మహిళా క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మేటి ఆటగాళ్ల కోసం నాలుగు ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి. ఒక్కో ఫ్రాంచైజీకి ప్లేయర్ల కొనుగోలు కోసం రూ.15 లక్షల బడ్జెట్ కేటాయించారు. ఒక్కో జట్టులో కనిష్టంగా 18 మంది, గరిష్టంగా 20 మంది ఆటగాళ్లను తీసుకునే అవకాశం ఉంది. వేలంలో మొత్తం 191 మంది ప్లేయర్లు ఉండగా.. 45 మంది గ్రేడ్-ఏ, 146 మంది గ్రేడ్-బీ కేటగిరీలో ఉన్నారు. గ్రేడ్-ఏ ఆటగాళ్ల బేస్ ప్రైస్ 50 వేలు కాగా.. గ్రేడ్-బీ ప్లేయర్ల బేస్ ప్రైస్ 30 వేలుగా నిర్ణయించారు. డబ్ల్యూఏపీఎల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మాజీ భారత కెప్టెన్ మిథాలీ రాజ్ వ్యవహరించనున్నారు. అమరావతి ఛాంపియన్స్, రాయలసీమ జెన్ స్టార్స్, వైజాగ్ ఫైర్ బర్డ్స్, గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్లు లీగ్‌లో బరిలోకి దిగనున్నాయి. సెప్టెంబర్ 15 నుంచి 26 మధ్య డబ్ల్యూఏపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. మంగళగిరి ఏసీఏ స్టేడియం వేదికగా మ్యాచ్‌లు జరగనున్నాయి. విజయవాడలో జరగనున్న ప్లేయర్స్ ఆక్షన్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రముఖ డబ్ల్యూపీఎల్ వేలం నిర్వాహకురాలు శ్వేతా బాల్ ఆధ్వర్యంలో వేలం నిర్వహించనున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: