Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home Telangana భారత వ్యతిరేకి మమ్దానీతో రేవంత్‌ భేటీ ఎందుకు? కిషన్‌రెడ్డి.

భారత వ్యతిరేకి మమ్దానీతో రేవంత్‌ భేటీ ఎందుకు? కిషన్‌రెడ్డి.

by CVR NEWS

సీఎం రేవంత్‌రెడ్డి లండన్ పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం స్థాయికి తగ్గట్టుగా పర్యటన ప్రణాళిక లేదని విదేశాంగ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసిందని కిషన్‌రెడ్డి తెలిపారు. అమెరికా పర్యటనకు రాజకీయ అనుమతి రాకముందే రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన ప్రారంభించారని ఆయన విమర్శించారు. విదేశీ పర్యటనలకు అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే కార్యక్రమాలు ఖరారు చేసుకోవాలని సూచించారు. అనుమతులు లేకుండానే సీఎం విదేశాలకు ఎందుకు వెళ్లారో తనకు తెలియదని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. కేంద్రం నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించిందని.. ఇందులో రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో యూపీఏ ప్రభుత్వం ఆయన అమెరికా పర్యటనను అడ్డుకున్న విషయాన్ని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. కేంద్రం అనుమతి రాకపోవడాన్ని తెలంగాణకు జరిగిన అన్యాయంగా రేవంత్‌రెడ్డి చిత్రీకరించడం అర్థరహితమని ఆయన మండిపడ్డారు. రేవంత్‌ విదేశీ పర్యటనపై కాంగ్రెస్–బీజేపీ మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: