Saturday, August 8, 2026
News Navigation
Saturday, August 8, 2026
News Navigation

Breaking

Saturday, August 8, 2026
Home Sports భూమి కావాలంటూ సీఎంను కోరిన రిషబ్ పంత్.

భూమి కావాలంటూ సీఎంను కోరిన రిషబ్ పంత్.

by CVR NEWS

టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులు నెట్టింట తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తన సొంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో భూమి కొనుగోలు చేయడానికి మార్గం సుగమం చేయాలని కోరుతూ నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీని ట్యాగ్ చేస్తూ పంత్ ఒకదాని వెనుక ఒకటి రెండు పోస్టులు చేశారు. ఢిల్లీ నుంచి సొంత రాష్ట్రానికి షిఫ్ట్ అయ్యే ప్లాన్ ఈ పోస్టుల్లో పంత్ తన మనసులోని ఆవేదనను పంచుకున్నారు. తాను ప్రస్తుతం ఢిల్లీ నుంచి తన బేస్‌ను మార్చుకుని సొంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో శాశ్వతంగా స్థిరపడాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. అయితే గత మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నప్పటికీ భూమి కొనుగోలుకు సంబంధించి ఎలాంటి స్పష్టమైన సమాచారం లేదా అనువైన పెద్ద స్థలం దొరకక ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. “నాకు నా ఉత్తరాఖండ్ అంటే ఎంతో ప్రేమ. నా సొంత కొండ ప్రాంత ప్రజల మధ్యకు వచ్చి ఉండాలని, రాష్ట్ర అభివృద్ధికి నా వంతు తోడ్పాటు అందించాలని అనుకుంటున్నాను. కానీ స్థలం కొనుగోలు ప్రక్రియలో స్పష్టత లేకపోవడం వల్ల ఇదొక నైట్‌మేర్‌లా మారింది. సర్, దయచేసి నాకు భూసేకరణ ప్రక్రియలో సాయం చేయండి” అని పంత్ సీఎంను వేడుకున్నారు.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: