Wednesday, September 23, 2026
News Navigation
Wednesday, September 23, 2026
News Navigation

Breaking

Wednesday, September 23, 2026
Home Andhra Pradesh అనంతపురంలో జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.

అనంతపురంలో జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.

by CVR NEWS

అనంతపురం జిల్లా రాజకీయాల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. తనపై నమోదైన కేసులు, గతంలో జరిగిన అరెస్టుల వ్యవహారంపై జేసీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలీసులతో ఇక మాట్లాడేది లేదని.. తనపై నమోదైన కేసులన్నింటినీ న్యాయస్థానాల్లోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు. 2020లో రవాణాశాఖ అధికారులను అడ్డం పెట్టుకుని తనపై డజన్ల కొద్దీ కేసులు నమోదు చేశారని జేసీ ఆరోపించారు. బీఎస్-3 వాహనాల వ్యవహారంలో అప్పటి డీటీసీ శివరామ ప్రసాద్ ఫిర్యాదుతో అనేక ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని అన్నారు. తనతో పాటు తన భార్య, కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి, కోడలు, అన్న జేసీ దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులపైనా కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 11న కుటుంబ సభ్యులతో కలిసి అనంతపురం కోర్టుకు హాజరవుతానని ప్రకటించారు. అవసరమైతే మళ్లీ జైలుకైనా వెళ్లేందుకు సిద్ధమేనని.. కానీ వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెప్పారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: