Saturday, September 26, 2026
News Navigation
Saturday, September 26, 2026
News Navigation

Breaking

Saturday, September 26, 2026
Home Andhra Pradesh విశాఖ ఉక్కు పేరుతో నకిలీ ఉత్పత్తులు.

విశాఖ ఉక్కు పేరుతో నకిలీ ఉత్పత్తులు.

by CVR NEWS

విశాఖ ఉక్కు బ్రాండ్ పేరుతో మార్కెట్లో నకిలీ ఉత్పత్తులు చెలామణి అవుతున్నాయన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న విశాఖ ఉక్కు కర్మాగారానికి ఇది మరో ఎదురుదెబ్బగా మారిందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా విశాఖ ఉక్కుకు అత్యంత గిరాకీ ఉన్న టీఎంటీ 550డి బార్లు పేరుతో నకిలీ ఉత్పత్తులు విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవల గ్యాస్ కొరత కారణంగా ఉత్పత్తి నిలిచిపోవడంతో మార్కెట్లో ఏర్పడిన కొరతను ఆసరాగా చేసుకుని, ఇతర ప్రాంతాల్లో తయారైన ఉత్పత్తులను “వైజాగ్ స్టీల్ 550డి” పేరుతో విక్రయిస్తున్నారని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. దీనివల్ల విశాఖ ఉక్కు బ్రాండ్ ప్రతిష్ఠ దెబ్బతినడమే కాకుండా వినియోగదారులు కూడా మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఉద్యమానికి దిగుతామని యూనియన్ నేతలు హెచ్చరిస్తున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: