Friday, October 16, 2026
News Navigation
Friday, October 16, 2026
News Navigation

Breaking

Friday, October 16, 2026
Home Andhra Pradesh గోరుకల్లు గ్రామంలోకి ఒక్కసారిగా పోటెత్తిన నీటి ప్రవాహం.

గోరుకల్లు గ్రామంలోకి ఒక్కసారిగా పోటెత్తిన నీటి ప్రవాహం.

by CVR NEWS

నంద్యాల జిల్లా గోరుకల్లు రిజర్వాయర్ గేట్ల ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. ఘటనకు అధికారుల నిర్లక్ష్యం కారణమా.. లేక దుండగుల చర్యనా అనే కోణాల్లో విచారణ జరిపిస్తున్నామన్నారు. బాధ్యులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తప్పవన్నారు. రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఘటనలో ఆస్తి నష్టం జరిగినప్పటికీ ప్రాణ నష్టం సంభవించకపోవడం కొంత ఉపశమనం లభించిందన్నారు ఎమ్మెల్యే చరితారెడ్డి. గోరుకల్లు గ్రామంలోకి నిన్న తెల్లవారు జామున అకస్మాత్తుగా భారీగా చేరిన రిజర్వాయర్ నీటి ప్రవాహం భారీగా చేరింది. గుర్తు తెలియని వ్యక్తులు గేటు ఎత్తడంతో ఎస్ఆర్‌బిసి సబ్ కెనాల్‌ పొంగి ఊళ్లోకి పెద్ద ఎత్తున నీటి ప్రవాహం చేరింది. దీంతో గ్రామస్థులు రిజర్వాయర్ తెగిపోయిందనే ప్రాణ భయంతో వేణుగోపాల స్వామి కొండెక్కారు. సమాచారం లేకుండా గేట్లు ఎత్తడంపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. ఇదిలావుండగా గోరుకల్లు గ్రామాన్ని కలెక్టర్ రాజకుమారి సందర్శించారు. ఈ ఘటనపై నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన అధికారులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు కారణమైన బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర హెచ్చరించారు.ఎస్ఆర్‌బిసి కాల్వకు పడిన మూడు గండ్లను పూడ్చేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: