మెటాపై అమెరికాలో కీలక విచారణ కొనసాగుతోంది. పిల్లల భద్రతకు సంబంధించిన అంశాలపై 29 రాష్ట్రాలు చేసిన ఆరోపణల నేపథ్యంలో కోర్టులో విచారణ జరుగుతోంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్‌లను పిల్లలను ఆకర్షించేలా డిజైన్ చేశారని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. పిల్లల భద్రతకు సంబంధించిన ప్రమాదాలను మెటా దాచిందని, పిల్లల వ్యక్తిగత సమాచారాన్ని రక్షించడంలోనూ సంస్థ విఫలమైందని ఆరోపణలు ఉన్నాయి. పిల్లల భద్రత కంటే యూజర్ ఎంగేజ్మెంట్కే మెటా ప్రాధాన్యత ఇచ్చిందని సంస్థ మాజీ ఇంజినీర్ కీలక వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. ఈ కేసులో మెటాకు భారీ నష్టపరిహారం ముప్పు ఉన్నట్లు తెలుస్తోంది. నష్టపరిహారం 200 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. అయితే మెటా అంచనా ప్రకారం నష్టం 1.4 ట్రిలియన్ డాలర్ల వరకు చేరే అవకాశం ఉందని సమాచారం. ఈ కేసులో వెలువడే తీర్పు భవిష్యత్తులో ఇతర టెక్ కంపెనీలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.
మెటాపై అమెరికాలో కీలక విచారణ.
59
previous post