Saturday, August 22, 2026
News Navigation
Saturday, August 22, 2026
News Navigation

Breaking

Saturday, August 22, 2026
Home Latest News అంతరిక్ష రంగంలో అమెరికా భారీ టార్గెట్.

అంతరిక్ష రంగంలో అమెరికా భారీ టార్గెట్.

by CVR NEWS

అంతరిక్ష రంగంలో అమెరికా మరో భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఏడాదికి వెయ్యి అంతరిక్ష ప్రయోగాలు నిర్వహించే దిశగా అడుగులు వేస్తోంది. వాణిజ్య అంతరిక్ష కార్యక్రమాలను వేగవంతం చేసే కీలక మెమోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ప్రైవేట్ కంపెనీలతో కలిసి స్పేస్ లాంచ్‌లను భారీగా పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికా అంతరిక్ష ప్రయోగాల సంఖ్యతో పోలిస్తే.. రాబోయే సంవత్సరాల్లో లక్ష్యాన్ని ఎన్నో రెట్లు పెంచాలని భావిస్తోంది. గత ఏడాది అమెరికా నుంచి మొత్తం 178 స్పేస్ లాంచ్‌లు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2030 నాటికి ఈ సంఖ్యను ఏకంగా వెయ్యికి చేర్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వాణిజ్య ఉపగ్రహాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, శాస్త్రీయ పరిశోధనలు, రక్షణ అవసరాలకు అనుగుణంగా పెరుగుతున్న అంతరిక్ష ప్రయోగాల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని అమెరికా ఈ భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ట్రంప్ సంతకం చేసిన మెమోతో ప్రైవేట్ స్పేస్ కంపెనీలకు మరిన్ని అవకాశాలు లభించే అవకాశం ఉంది. దీంతో అమెరికా అంతరిక్ష రంగంలో పోటీ మరింత పెరగనుంది.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: