అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హులికెరలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. రాయదుర్గం నియోజకవర్గంలో పలు కీలక పవన విద్యుత్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. సుజ్లాన్ విండ్ పవర్ ప్రాజెక్ట్స్ ఆధ్వర్యంలో చేపట్టనున్న 1,325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం నిర్వహించారు. హులికెరలో సుజ్లాన్ S144 కొత్త బ్లేడ్ ఉత్పత్తి లైన్లను మంత్రి లోకేష్ ప్రారంభించారు. పునరుత్పాదక ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ఈ ప్రాజెక్టులను చేపడుతున్నారు.పవన విద్యుత్ ఉత్పత్తితో పాటు స్థానికంగా పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భారీ పెట్టుబడులతో అనంతపురం జిల్లాలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోనున్నాయి. రాయదుర్గం ప్రాంతాన్ని గ్రీన్ ఎనర్జీ హబ్‌గా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. 1,325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడంతో అనంతపురం పునరుత్పాదక ఇంధన రంగంలో మరో కీలక ముందడుగు వేసింది.
అనంతపురంలో పవన విద్యుత్ ప్రాజెక్టులకు శ్రీకారం.
4
previous post