Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Andhra Pradesh పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

by CVR NEWS

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. సముద్ర వేటకు వెళ్లిన బోటు.. ఇసుకదిబ్బను ఢీకొనడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి.. ఈదుకుంటూ ఒడ్డుకు చేరేందుకు ప్రయత్నించారు. సమాచారం తెలుసుకున్న చిన్నలంక గ్రామస్తులు వెంటనే అప్రమత్తమై.. పడవలపై సముద్రంలోకి వెళ్లి ఏడుగురు మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. వీరంతా కాకినాడకు చెందిన మత్స్యకారులుగా గుర్తించారు. ఏడు రోజుల క్రితం వేటకు బయలుదేరిన బోటులో సాంకేతిక సమస్య తలెత్తడంతో.. మరో బోటు సహాయంతో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు చిన్నలంకకు చేరుకుని.. మత్స్యకారులను పునరావాస కేంద్రానికి తరలించారు. గ్రామస్తుల సమయస్ఫూర్తితో ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: