Wednesday, July 15, 2026
News Navigation
Wednesday, July 15, 2026
News Navigation

Breaking

Wednesday, July 15, 2026
Home Andhra Pradesh పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్.

పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్.

by CVR NEWS
పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పరామర్శించారు. భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పవన్‌ను ఫడ్నవీస్ కలిసి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. పవన్ కల్యాణ్ కుడి భుజానికి శనివారం సుమారు మూడున్నర గంటల పాటు వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. 2016లో ఆయన భుజానికి గాయమవగా, ఇటీవలి రాజకీయ పర్యటనల్లో అభిమానులు, కార్యకర్తల తాకిడి కారణంగా ఆ గాయం తీవ్రతరమైంది. దీంతో వైద్యులు శస్త్రచికిత్స చేయాలని సూచించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, వేగంగా కోలుకుంటున్నారని వైద్య బృందం వెల్లడించింది.

 

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

040406
Total views : 207682

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: