Tuesday, August 25, 2026
News Navigation
Tuesday, August 25, 2026
News Navigation

Breaking

Tuesday, August 25, 2026
Home Latest News రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

by CVR NEWS

రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల ముక్కిడిగుండం మొల్లచింతపల్లి నార్లాపూర్ రామాపురం చెన్నంపల్లి ఎంగంపల్లి గ్రామాలకు సంబందించిన పెండింగ్ భూముల రికార్డులను రైతుల సమక్షంలో మంత్రి పరిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ… భూమినే నమ్ముకొని బతికే రైతుకు అండగా ఉంటుందన్నారు. రైతులు ఎవరు అధైర్య పడద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి జూపల్లి భరోసా ఇచ్చారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: