Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home International భారత్-ఆస్ట్రేలియా సీఈఓలతో ప్రధాని మోదీ కీలక భేటీ.

భారత్-ఆస్ట్రేలియా సీఈఓలతో ప్రధాని మోదీ కీలక భేటీ.

by CVR NEWS
భారత్-ఆస్ట్రేలియా సీఈఓలతో ప్రధాని మోదీ కీలక భేటీ

భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్‌తో కలిసి ఇరు దేశాల ప్రముఖ సీఈఓలు, వ్యాపార దిగ్గజాలతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణ, కీలక రంగాల్లో సహకారం పెంపు, కొత్త పెట్టుబడి అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. భారత్-ఆస్ట్రేలియా ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే ఈ సమావేశం ప్రధాన లక్ష్యంగా నిలిచింది.వ్యాపారం, పెట్టుబడులు, సాంకేతికత, కీలక పరిశ్రమల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంచేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని నేతలు స్పష్టం చేశారు. దీంతో ఇండియా-ఆస్ట్రేలియా వ్యూహాత్మక ఆర్థిక భాగస్వామ్యానికి మరో కీలక ముందడుగు పడినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

039426
Total views : 196771

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: