Saturday, August 8, 2026
News Navigation
Saturday, August 8, 2026
News Navigation

Breaking

Saturday, August 8, 2026
Home Andhra Pradesh కిర్లంపూడిలో ముద్రగడ ఇంటి దగ్గర ఉద్రిక్తత.

కిర్లంపూడిలో ముద్రగడ ఇంటి దగ్గర ఉద్రిక్తత.

by CVR NEWS
కిర్లంపూడిలో ముద్రగడ ఇంటి దగ్గర ఉద్రిక్తత

కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. తండ్రిని కడసారి చూసి నివాళులర్పించేందుకొచ్చిన కూతురు క్రాంతిని పోలీసులు అడ్డుకున్నారు. ఆమె కిర్లంపూడి రావడానికి వీల్లేదని కుటుంబసభ్యులు సూచించడంతో.. ప్రత్తిపాడు దగ్గరే క్రాంతి కార్లను నిలిపివేశారు. చాలాసేపటి తర్వాత తండ్రి చివరిచూపుకోసం అనుమతించగా.. ఆమె వెనుకే పోలీసులు మఫ్టీలో ఫాలో అయ్యారు. ఎట్టకేలకు క్రాంతి కిర్లంపూడికి చేరుకోగా.. ఆమెను లోపలికి రానివ్వొద్దని, బయటే ఆపివేయాలని ముద్రగడ పద్మనాభం భార్య, క్రాంతి తల్లి వాపోయారు. దీంతో ముద్రగడ అనుచరులు, అభిమానులు క్రాంతిని అడ్డుకున్నారు. తాను చనిపోయాక చివరి చూపుకు కూడా కూతురు క్రాంతి రావొద్దని గతంలో ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఆయన కోరిక మేరకు క్రాంతిని వెనక్కి పంపించివేయాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. పోలీసుల భద్రత, తోపులాటల మధ్యే తండ్రి కడసారి చూసి వెనక్కి వెళ్లిపోయారు క్రాంతి. చివరి చూపుకోసం అతి కష్టంగా తండ్రి ఇంటికొచ్చిన తనను.. రెండునిమిషాలైనా చూడనివ్వకపోవడంతో.. భోరున విలపించారు క్రాంతి. ఆమె రాకతో కిర్లంపూడిలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులే ఆమెను మళ్లీ వెనక్కి తీసుకువెళ్లిపోయారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: