Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Film డిసెంబర్ 3న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ “ఫౌజీ”.

డిసెంబర్ 3న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ “ఫౌజీ”.

by CVR NEWS
డిసెంబర్ 3న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ "ఫౌజీ"

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్న మూవీ రెబల్ స్టార్ ప్రభాస్ “ఫౌజీ”. ఈ క్రేజీ మూవీ రిలీజ్ డేట్ ను ఈ రోజు మేకర్స్ అనౌన్స్ చేశారు. అజాతపర్వం ముగిసింది, ది రెబలియన్ ప్రారంభమైంది అంటూ డిసెంబర్ 3న ఫౌజీ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి టీ సిరీస్ సంస్థ ప్రెజెంటర్ గా వ్యవహరిస్తోంది.

ఫౌజీ రిలీజ్ డేట్ సందర్భంగా విడుదల చేసిన స్టన్నింగ్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యుద్ధంలో శత్రువులను మట్టుబెట్టి పంచెకట్టులో ఒంటి నిండా రక్తం మరకలతో రైఫిల్ తో కూర్చుని ఉన్న ప్రభాస్ స్టిల్ ఫౌజీ సినిమాపై ఆసక్తి రేపుతోంది. ఒంటరిగా పోరాడే సైన్యం అతడు అంటూ పోస్టర్ లో రాసిన క్యాప్షన్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వీ నాయికగా నటిస్తోంది. ఈ ఏడాది రిలీజ్ అవుతున్న చిత్రాల్లో “ఫౌజీ”పై హై ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

040820
Total views : 211873

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: