పోలీస్ శాఖలో మరో తీవ్ర విషాదం నెలకొంది. త్రిపుర రాష్ట్ర డీజీపీ అనురాగ్ ధన్కడ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. అగర్తలాలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో గన్‍తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన్ను గమనించిన సిబ్బంది వెంటనే అగర్తలాలోని జీబీ ఆసుపత్రికి తరలించారు. ఐతే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రాష్ట్ర అత్యున్నత పోలీసు అధికారి ఇలా ఆత్మహత్యకు పాల్పడటం త్రిపుర పరిపాలన, పోలీసు వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని నింపింది. ఈ ఘటన గురించి తెలియగానే ప్రభుత్వ ఉన్నతాధికారులు, సీనియర్ పోలీసు సిబ్బంది పరిస్థితిని సమీక్షించేందుకు వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.1994 బ్యాచ్‌కు చెందిన త్రిపుర క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన అనురాగ్ ధన్కడ్ మే 2025లో త్రిపుర డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర పోలీసు శాఖలో అత్యున్నత స్థాయిలో ఉన్న అనురాగ్ ధంకర్ ఇలా ఆత్మహత్యకు పాల్పడటం వెనకు కారణం ఏంటనేది సస్పెన్స్ గా మారింది.
త్రిపుర డీజీపీ అనురాగ్ ధన్కడ్ ఆత్మహత్య.
30
previous post




Total views : 221458