మహారాష్ట్ర పుణే జిల్లా బారామతిలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. శిక్షణకు ఉపయోగించే ఓ విమానం సాంకేతికలోపంతో కూలిపోయింది. ఈ ఘటనలో ట్రైనీ పైలట్‌కు గాయాలయ్యాయి. రెడ్‌బర్డ్ ఏవియేషన్ సంస్థకు చెందిన విమానం శిక్షణ కార్యక్రమంలో ఉండగా అందులో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో ఉదయం 9 గంటల సమయంలో బారామతి విమానాశ్రయాన్ని ఆనుకొని ఉన్న గోజుబావి గ్రామం సమీపంలో క్రాష్ ల్యాండ్ అయ్యింది. ఈ ల్యాండింగ్‌కి ముందు విమానంలోని కొంత భాగం ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో విమానంలో శిక్షణ పొందుతున్న పైలట్ మాత్రమే ఉన్నారు. ఈ ఘటనలో అతనికి గాయాలయ్యాయి. క్రాష్ ల్యాండింగ్ అయిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు. ఐతే ఈ గ్రామంలో ఇంతకుముందు కూడా విమాన ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
Tag:





Total views : 75090